దేశీ @ విదేశం Back   Home 
భారతదేశం లో సంప్రదాయాలూ, ప్రేమాభిమనాల మధ్య పుట్టి పెరిగిన వ్యక్తి ఒక్కసారిగా తనవారినీ, తనదన్న ప్రతీదీ ఒదిలి ఒంటరిగా విదేశం లో తన జీవిత పయనం నిర్దేశించుకున్నప్పుడు కొత్త పరిస్థితులకి అలవాటు పడటానికి కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతారు. కొండొకచో ఒక విధమైన కల్చర్ షాక్ కి లోనౌతారు. ఎటువంటి పరిస్థితి లో అయినా రాణించాలి అనే పట్టుదల కలవారు తప్పకుండా రాణిస్తారు. కానీ ఆ విజయం అందుకోవటానికి ప్రయాణించే మార్గం ఎన్నో వింతలూ, అనుభూతులూ, ఆశలూ నిరాశల తో నిండినది.