| ఈ పేజీ ని పంపండి |
ఆ మధ్య రచ్చబండ లో ఎవరో ఎప్పుడన్నా flight మిస్ అయ్యారా, ఎందుకు? ఎలా అని ఒక తాడు మొదలెట్టారు. అప్పటికి నాకు అలాంటి అనుభవాలేమీ పెద్దగా లేవు కాని ఈ Thanksgiving నాడు మాత్రం భలే అనుభవం. మొత్తం 24 గంటల కాలం లో నాలుగు flights మిస్ అయిన అనుభవం అయింది. దాని గురించి చెప్తే నా కొలీగ్స్ "Terminal-2" అని ఆట పట్టించారు.
సరే, విషయానికి వద్దాం.
నా TN వీసా డిసెంబర్ దాకా వుంది. కానీ నేను ఇండియా వెళ్ళాలని ప్లాన్. అది అయ్యేలోగా వెళ్ళి TN ని పొడిగించేసుకుందాం అని నవెంబర్ మొదటి వారం లో Toronto వెళ్ళాను. కానీ నా ఉద్యోగం పొడిగింపు జనవరి నుండి అని వుంది. ఇవాళ ఇంకా నవెంబర్ మొదటి వారం. ఇప్పుటి నుండి జనవరి వరకూ నువ్వు అమెరికా లో ఇల్లీగల్ గా పని చేసినదానివి అవుతారు సరి అయిన ఆఫర్ లెటర్ లేకుండా అని చెప్పి అక్కడి ఆఫీసర్ నాకు TN ఇవ్వటానికి నిరాకరించారు. రెజెక్ట్ చెయ్యటానికి ఆయన ఇంకొక కారణం కూడా చూపించారు. నా ఆఫర్ లెటర్ లో నా job title "Systems Analyst" అని వుంది. కానీ TN వీసా కోసం approved job titles లో పేరు "Computer Sytems Analyst". నా ఆఫర్ లేటర్ లో ఆ మొదటి "Computer" అనే ముక్క లేదు కనుక రెండూ ఒకటి కావు అని.
సరే, అని మా HR తో విషయం చెప్పి ఆయన చెప్పిన డేట్ లూ, జాబ్ టైటిల్ సరిదిద్ది, Thanksgiving నాడు మళ్ళీ టొరొంటో కే బయలుదేరాను. నేను అసలు ఏ బోర్డర్ లో అయినా ఈ TN వీసా తీసుకోవచ్చు కానీ మొదటి సారి టొరొంటో వెళ్ళటానికి కారణం DVD లు కొనుక్కుందామని. అనుకోకుండా అక్కడ వీసా రిజెక్ట్ అయింది. రెండో సారి మళ్ళీ టొరొంటో నే వెళ్ళటానికి కారణం భయం! వేరే ఎక్కడకైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తమ సిస్టం లో నాకు అంతకు వారం క్రితం TN వీసా రిజెక్ట్ అయిందని చూస్తారు. ఎందుకు, ఏం చేసిందో అని మరింత అనుమానం తో పట్టి చూస్తారు, అనవసరం గా లేనిపోని అనుమానాలు తెప్పించిన దానిని అవుతాను అని మొదట రిజెక్ట్ చేసిన ఆఫీసర్ దగ్గరికే రెండో సారి వెళ్ళచ్చు అని టొరొంటో వెళ్ళాను.
నా flight పొద్దుట 6:20 గంటలకి. ఇంటర్నేషనల్ flight కనుక 3 గంటలు ముందు వెళ్ళాను. పైగా thanksgiving రష్ చాలా వుంది అని ముందు రోజు TV లో మరీ మరీ చెప్పారు. దాని కోసం 2:00 గంటలకి లేచి పూజా పునస్కారాలు పూర్తి చేసుకొని (ఈ సారి ఏ ఇబ్బందీ లేకుండా వీసా ఇప్పించమని వేడుకోవటానికి! రెండో సారి TN వీసా రిజెక్ట్ అయింది అంటే నేను చాలా ఇబ్బందులలో పడిపోతాను!) ఇంట్లో మూడున్నర కి బయలుదేరాను.
కారు airport లో పార్క్ చేసి వెళ్ళాలని ప్లాన్. నేను తిరిగి వచ్చేది మధ్యహ్నం 4:20 flight లో. సాయంత్రం మా ఫ్రెండ్స్ ఇంట్లో Thanksgiving డిన్నర్ దోశల పార్టీ వుంది. వాళ్ళతో నేను 6:00 గంటలకల్లా వచ్చేస్తాను అని చెప్పాను. చెప్పటానికి, ప్లాన్ వెయ్యటానికి చాలా సింపుల్ ప్లాన్ అనే అప్పటికి అనిపించింది.
మొదటి ఇబ్బంది.. పార్కింగ్ లాట్ నిండిపోయింది. కనుక నాది టెర్మినల్ B అయితే ఎక్కడో టెర్మినల్ E లో పార్క్ చేసాను. నా టెర్మినల్ కి వెళ్ళటానికి షటిల్ తీసుకొని వచ్చేసరికి ఇంక రెండు గంటలు వుంది అంతే నా flight కి. పరుగులు పెడుతూ వెళ్ళాను. అక్కడ వున్న Kiosk లో బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకున్నాను. చూస్తే దానిలో నా గేట్ నెంబర్ లేదు. అనుమానం వచ్చింది. అప్పుడు కూడా నా బోర్డింగ్ టైము వైపు చూడలేదు. బోలెడంత లైను వున్నా టికెట్ కౌంటర్ లైన్ లో మరో పది నిమిషాలు నుంచుని ఆమెని అడిగాను "నా గేట్ నెంబర్ లేదు అని". అప్పుడు ఆమె చెప్పారు. నా flight కాన్సిల్ అయింది. ఇప్పుడు నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చింది 10:55 కి బయలుదేరే flight కి అని! ఇంకా flight బయలుదేరుతుందో లేదో తెలీదు కనుక గేట్ నెంబర్ లేదు. flight బయలుదేరటం confirm అయితే మోనిటర్ లో నా గేట్ నెంబర్ చూసుకోమని చెప్పారు.
నాకు ఇప్పుడు ఇబ్బంది ఒకటి ఎదురు అయింది. నా తిరుగు ప్రయాణం 4:20 గంటల flight లో. TN వీసా కి నేను టొరొంటో పియర్సన్ airport లోని US Customs దగ్గరకి వెళ్ళాలి. వాళ్ళు ఖచ్చితం గా చెప్తారు మీ flight కి కనీసం మూడు గంటల ముందు మా దగ్గరకి రావాలి మా పని గంట పైన వుంటుంది. వచ్చి, నాకు flight టైము అయిపోతోంది అంటే కుదరదు అని. నేను మూడు గంటల ముందు వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి అంటే 1:15 దరిదాపుల్లో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచోవాలి. కానీ ఈ 10:55 flight టొరొంటో చేరేదే 12:45 కి. అరగంట లో కొంచెం మొఖం అదీ కడుక్కుని, ఏమన్నా తిని వెళ్ళటానికి టైము వుంటుందో లేదో.. అసలు ఈ flight టైము కి లాండ్ అవుతుందో లేదో తెలీదు.. అన్నీ అనుమానాలే.
ఎన్ని అనుమానాలు వున్నా నిద్రాదేవి ఆవరించినప్పుడు అన్నీ మర్చిపోతుంటాను. airport లో 10:00 గంటల వరకూ నిద్రపోయి మొత్తానికి టైము కి బయలుదేరిన flight లో కూర్చోవటం జరిగింది. Flight టైము కి టొరొంటో చేరింది కూడా. కానీ runway మీద నుండి Gate కి వెళ్ళటానికి అరగంట పట్టింది. చెప్పటం మర్చిపోయాను కదూ flight కాన్సిల్ అవటానికి కారణం టొరొంటో లో కుండపోత గా కురుస్తున్న మంచు!
నేను airport లో అడుగు పెట్టేసరికి 1:00 అయింది. US గేట్స్ దగ్గరకి మళ్ళీ పరుగులు పెట్టి నా బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకుని చూస్తే ఈ సారి గేట్ నెంబర్ వుంది కానీ బోర్డింగ్ టైము 6:15 అని వుంది. అదేమిటీ నా Flight 4:20 కి కదా అని అక్కడ వున్న Display monitors లో చూస్తే నా 4:20 గంటల flight కాన్సిల్ అని వుంది. పోన్లే అని కొద్దిగా స్థిమిత పడి ఏదన్నా తిందామని చూస్తే రుచించేవి ఏమీ లేవు అక్కడ. పైగా TN వీసా సంగతి ఏమిటో చూసేసుకుంటే తినటం గురించి తర్వాత చూసుకోవచ్చు లే అని వెళ్ళి US customs వాళ్ళ లైన్ లో వెళ్ళి నుంచున్నాను.
ఆ నుంచున్నప్పుడే నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి నా flight delay అయింది నేను బోస్టన్ వచ్చేదే 7:30 కి కనుక ఇవాళ Thanksgiving పార్టీ కి రావటం కుదరదు అని చెప్పాను. దానికి అతను అదేమీ లేదు, ఎంత లేట్ అయినా సరే రావల్సిందే అన్నారు. సరే, బోస్టన్ రాగానే ఫోన్ చేస్తాను అని చెప్పాను.
US Customs ఆఫీస్ లో నా ముందు ఒక Taiwan కుటుంబం ఇదే TN వీసా కోసం వున్నారు. వాళ్ళ పేపర్లు అక్కడి ఆఫీసర్ పరిశీలిస్తున్నారు. నన్ను రిజెక్ట్ చేసిన ఆఫీసర్ అక్కడ కనిపించలేదు. కానీ, ఇంకో ఆఫీసర్ నన్ను పిలిచి నా పేపర్లు తీసుకున్నారు. కూర్చోండి పిలుస్తాం అన్నారు.
చెప్పొద్దూ కొంచెం టెన్షన్ గానే వున్నాను. ఈ సారి ఏ ఇబ్బందీ లేకుండా వీసా వచ్చేసేలా చూడు స్వామీ అని సాయిబాబా కీ, వెంకటేశ్వర స్వామి కీ మొక్కులు మొక్కుకుంటున్నాను.
ఇంతలో నా పక్కన వున్న Taiwan కుటుంబం లోని ఆయన్ని ఆఫీసర్ పిలిచారు. ఆఫీసర్ ఎర్రగా ధుమధుమలాడటం మొదలెట్టారు ఈయనతో మాట్లాడుతూ.
ఆఫీసర్: "ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ నుంచి వచ్చాయి?"
వ్యక్తి: "Taiwan" (experience లెటర్ అనుకుంటా)
ఆఫీసర్: "దీనిని సంతకం చేసిన వ్యక్తి ఎక్కడ చేసారు వీటిని?"
వ్యక్తి: "Taiwan"
ఆఫీసర్: "These are fake documents" (పెద్ద హుంకరింపు తో)
వ్యక్తి: "NO"
ఆఫీసర్: "I can prove"
అని చెప్పి, ఆఫీసర్ కొన్ని పేపర్లు తీసుకొచ్చారు.
ఆఫీసర్: "చూడండి, 8.5x11 పేపర్ కేవలం North America లో వాడతాము. Taiwan లోనూ, Asian countries లో ఎక్కడా ఈ సైజు పేపర్ వాడరు. వాళ్ళు A4 అని పిలుస్తారు అనుకుంటా వాళ్ళు ఉపయొగించే పేపర్ ని. మీరు తెచ్చిన ఈ డాక్యుమెంట్ 8.5x11 పేపర్. ఇది ఇక్కడే ఎవరో సృష్టించారు. ఖచ్చితం గా ఇది Taiwan నుండి రాలేదు. నేను మీ వీసా ని రిజెక్ట్ చెయ్యటమే కాదు.. మీరు fake పేపర్ల తో US లో అడుగెట్టేందుకు ప్రయత్నిస్తున్నందుకు మిమ్మల్ని remove చెయ్యగలను కూడా. మళ్ళీ ఇంక ఎప్పుడూ మీరు US కి రాలేరు. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. నేను మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను."
ఈ వ్యక్తి కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏదో చెప్పబోయారు కానీ ఏమి వినే మూడ్ లో ఆఫీసర్ లేరు.
"మీరు ఇంకొక్క క్షణం ఇక్కడ వున్నా మిమ్మల్ని ఇక్కడ నుండి బలవంతం గా బయటకి పంపించాల్సి వస్తుంది. వెళ్ళి కూర్చోండి" అని అతను గట్టిగా అనేసరికి మొత్తం ఆ గది లో వున్న మిగిలిన ఆఫీసర్లూ, వీసా కోసం వచ్చిన మిగిలిన వాళ్ళూ, ఆ ఆఫీసర్ పై అధికారీ అంతా నిశ్చేష్టులై చూసారు. ఆఫీసర్ పరిస్థితి వివరించటానికి తన పై ఆఫీసర్ గది లోకి వెళ్ళారు.
నాకు అసలు అంత క్రిటికల్ సిట్యుయేషన్ లో కూడా భలే ముచ్చట వేసింది ఆ ఆఫీసర్ లాజిక్ కి. నిజమే కదా, India లో కూడా ఇక్కడ ఉపయోగించే పేపర్ వాడము.
తరువాత వంతు నాది. నాకు ఆ ఆఫీసర్ మొఖం నచ్చలేదు. కోపం గా వుంది. అసలే ముందు కేస్ తో మరింత కోపం గా తయారయ్యారు. నాకు అతను వద్దు వేరే ఆఫీసర్ ఎవరన్నా నా కేస్ చూస్తే బాగుండు అనుకున్నాను.
వేరే ఆడ ఆఫీసర్ నన్ను పిలిచారు.
ఆఫీసర్: "నువ్వు ప్రతీ వారం టొరొంటో నుండి బోస్టన్ వస్తూ పోతూ వుంటావా?"
నేను: "లేదు. క్రితం వారం వచ్చాను TN వీసా కోసమే. కానీ ఆఫీసర్ అప్పుడు నా ఆఫర్ లెటర్ లో dates ఏవో తేడా వచ్చాయి అని మళ్ళీ రమ్మన్నారు (కావాలనే రిజెక్ట్ అనే మాట వాడలేదు)"
ఆఫీసర్: "తెలుసు. అతను తన రిపోర్ట్ లో ఆ రీజన్ అంతా వివరించారు. కానీ ఈ ఆఫర్ లెటర్ లో కూడా ఇబ్బంది వుంది."
నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. గొంతు తడారి పోతుండగా అడిగాను
నేను: "ఏమిటి?"
ఆఫీసర్: "నీ ఆఫర్ లెటర్ లో start date డిసెంబర్ 14 అని వుంది. కానీ ఇవాళ ఇంకా నవెంబర్. నేను ఇవాళ నీకు వీసా ఇస్తే కేవలం ఒక సంవత్సరం వరకూ ఇవ్వగలను. అంటే వచ్చే సంవత్సరం నవెంబర్ లో నీ వీసా expire అయిపోతుంది. మరి నీ ఉద్యోగం మాత్రం డిసెంబర్ వరకూ వుంది. మరి ఆ మూడు వారాలూ ఎలా పని చేస్తావ్?"
నాకు అర్థం కాలేదు. క్రితం సారి ఎవరూ ఈ తరహా ప్రశ్నలు వెయ్యలేదు. ఈ సారే ఇది రెండో సారి! కానీ ఏదో ఒకటి చెప్పాలి కనుక అన్నాను.
నేను: "నా వీసా క్రితం సంవత్సరం ది డిసెంబర్ 14 వరకూ వుంది. అందుకని మా HR ఆఫర్ లెటర్ డెసెంబర్ 15 నుండి ఇచ్చారు."
ఆఫీసర్: "కానీ నువ్వు వీసా కోసం ఇవాళ వస్తే ఇవాళ నుండీ ఇస్తాను నేను. నీకు డిసెంబర్ 15 నుండి అని నేను ఇవాళ date వేసి ఇవ్వలేను కదా!? ఇవాళ నుండీ నేను ఇస్తే నీకు 11 నెలలే ఆ ఉద్యోగం చెయ్యగలవ్. మరి మీ boss ఒప్పుకుంటారా?"
మా boss అన్నిటికీ ఒప్పుకుంటారు. ఆయనకి కూడా నేను ఏ ఇబ్బందీ లేకుండా వీసా తెచ్చుకోవటమే కావాలి. కనుక వేరే ఆలోచించకుండా అనేసాను.
నేను: "నా ప్రోజెక్ట్ ప్రస్తుతం 10-11 నెలలు వుంది." (మా కొత్త వెర్షన్ రిలీజ్ డేట్)
ఆఫీసర్: "అయితే నీకు ఒక నెల రోజులు పోయినా పర్లేదు అనమాట?"
నేను: "పర్లేదు" (అంతగా నా project extend అయితే మళ్ళీ వచ్చి extend చేసుకోవచ్చు కదా)
ఆఫీసర్: "సరే, అయితే $50 USD Fees కట్టేసేయి."
"హమ్మయ్య!" అనుకుంటూ మొఖం మతాబా లా వెలిగిపోతుండగా దీన వదనం తో కూర్చున్న ఆ Taiwan కుటుంబం వున్న దగ్గరకి వచ్చాను. నా bags తీసుకోవటానికి.
"పాపం!" అనిపించింది వాళ్ళని చూడగానే.
వీసా పని అయ్యేసరికి మూడు అయింది. భోజనం చేసి నా టెర్మినల్ దగ్గరకి వచ్చి బోస్టన్ లో కొనుక్కున్న కిరణ్ దేశాయ్ నవల "The Inheritance of Loss" చదవటం మొదలెట్టాను.
దాదాపు అయిదు ప్రాంతం లో Display monitor లో మా flight గేట్ మారింది, departure టైము కూడా ఇప్పుడు 8:15 అయింది అని చూపించటం మొదలెట్టారు. బయట మంచు ఇంకా పడుతూనే వుంది.
కొత్త గేట్ దగ్గరకి వచ్చి కూర్చున్నాను. బోస్టన్ వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అవుతుంది ఇంక పార్టీ కి ఏం వెళ్ళడం లే అని "రాను" అని చెప్పటానికి ఫోన్ చేస్తే లేదు, మేము ఇవాళ రాత్రి అంతా ఇక్కడే వుంటాం. నువ్వు airport నుండి డైరెక్ట్ గా ఇక్కడకి వచ్చేసేయ్ అని ఆర్డర్ వేసారు నా ఫ్రెండ్స్.
ఎనిమిదింపావు flight కాస్తా 9:55 flight అయింది. 9:55 flight తిరిగి 10:30 flight అయింది.
మా ఒక్కళ్ళదే కాదు. టొరొంటో నుండి ఆ రోజు బయలుదేరుతున్న flights అన్నిటి పరిస్థితీ అదే. చివరకి 10:30 flight వచ్చి గేట్ దగ్గర వుంది అని శుభవార్త చెప్పారు మా flight attendent.
కానీ ఇంకో flight attendent snow, slow traffic లో రావటం ఆలశ్యం అయింది కనుక ఆమె వచ్చిన వెంటనే వెళ్ళిపోదాం అన్నారు. ఈ లోగా మాకోసం flight లో heating system ని on చేసి వుంచుతాం.. ఎదీ గంటన్నర లో బోస్టన్ వెళ్ళిపోవచ్చు అని ఊరించారు.
ఆ flight attendent వచ్చేసరికి 11:15 అయింది. బోర్డింగ్ మొదలెట్టారు. మేమంతా కూర్చునేసరికి 11:30 అయింది. అయినప్పటికీ flight కదలదే!?
స్నో ఎక్కువ వుంది కనుక defrosting agent ఏదో spray చెయ్యాలి. అది అవగానే వెళ్ళిపోదాం అని pilot చెప్పారు.
కానీ ఆ spray కోసం మా ముందు ఇంకా మూడు flights వున్నాయి. ఒకోటీ 20 నిమిషాలు పైన పడుతోంది. మా flight కి spray అయేసరికి 12:45 అయింది. Pilot మా అందరికీ good morning! చెప్పి, ఇంక వెళ్ళిపోదాం అయిపోయింది అని మరోసారి చెప్పారు.
ఇంక ఆశ పడటం, నిరాశ పడటం అనే cycle నుండి అప్పటికి బయటకి వచ్చేసాను. ఇంటికి వెళ్తే వెళ్తాను. లేకపోతే లేదు. గుంపు తో గోవిందా అని పుస్తకం చదువుకోవటం లో మునిగి పోయాను.
కానీ మొత్తానికి 1:00 కి మా flight గాలి లోకి లేచింది. బోస్టన్ వచ్చేసరికి 2:45 అయింది. బోస్టన్ లో ఏ గాలీ ధూళీ లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు నేను టెర్మినల్ E కి వెళ్ళాలి నా కారు కోసం.
టెర్మినల్స్ మధ్య తిరిగే షటిల్ 12:00 తరువాత తక్కువ. అక్కడ ఒకాయన్ని అడిగాను. టెర్మినల్ E కి నడిచి వెళ్ళటం కి ఎంత దూరం అని. అతను వెళ్ళచ్చు. కానీ నేను తీసుకోబోతున్న షటిల్ టెర్మినల్ E దగ్గరకి వెళ్తుంది. నాతో వచ్చేయి అన్నారు.
నాకు నడిచే ఓపిక లేదు. అన్నట్టు మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే వాళ్ళు పార్టీ అయిపోయింది అని చెప్పారు! సరే, ఏదో ఒకటి తినచ్చు లే దారి లో అనుకున్నా, అర్థరాత్రి 2:00 కి ఏదీ దొరకదు అని మర్చిపోయి.
కారు లో కూర్చున్నా కానీ భయం. బాగా అలసిపోయి వున్నాను. నిద్ర కూడా వస్తోంది. తెల్లారగట్ట 2:00 గంటలకి లేచాను. ఇప్పుడు మళ్ళీ తెల్లారగట్ట 2:00 అయింది. మొత్తం 24 గంటలు airport, flight ల మధ్య గడిచింది అనుకుంటూ చెవులు చిల్లులు పడేలా ఉదిత్ నారాయణ్ పాడిన "Khaike Paan Banaaras vaali (Don)" ని రిపీట్ మోడ్ లో వింటూ ఇంటికి చేరుకున్నాను.
|
|
* * End * *
|
|
|
మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.
|
|