చురకలు 7 - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి

క్రొత్తగా వచ్చిన వాళ్ళు, ఇక్కడే చాలారోజులుగా వున్నవారు, అందరూ ఇక్కడి పద్ధతులు, మన భారతదేశంలో దాదాపుగా ఎదుర్కొనని పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తూ వుంటుంది. మనకి అది ఎందుకు అలా జరిగింది అని తెలియక పోతే పెద్ద చిక్కుల్లో పడతాం. మనని రక్షించుకునేందుకు నాకు ఇక్కడి పద్ధతులు తెలియవు అని ప్రతీ సారీ కవర్ చేసుకోలేం. ఇది చదవండి. నేను అలా తెలియకుండా ఒక వ్యక్తిని చాలా గాయపరచాను. నన్ను నేను చాలా ఎంబర్రాసింగ్ సిట్యుయేషన్ లో పెట్టుకున్నాను. కానీ నా అదృష్టం ఏమిటి అంటే, ఆ వ్యక్తి నేనింకా నా అజ్ఙానంలోనే వున్నాననుకొని నన్ను క్షమించేసారు. నేను తేలు కుట్టిన దొంగలా మౌనం వహిస్తున్నాను.

నేను పనిచేసే దగ్గర కొత్తగా xyz చేరారు. తనని మా బాస్ నాకు పరిచయం చేయగానే నాకు అతను చాలా వింత గా అనిపించారు. చూడటానికి అమ్మాయిలా, ఆ డ్రస్సింగ్ అదీ, ఎందుకో నాకు మంచి అభిప్రాయం కలగలేదు. ఎంతో మంచి మనిషి. నాకు ఆ విష్యం రెండుమూడు రోజుల్లోనే తెలిసింది. ఎందుకంటే మా పని దృష్ట్యా ఇద్దరం రోజూ సంప్రదించుకోవాలి. తనకి వున్న అపారమైన విజ్ఙానం, అయినా ఎక్కడా ఏ ఆర్బాటం చూపించకపోవటం మొత్తానికి మనసులో ఎక్కడో తెలియదు మంచి అభిప్రాయం కూడ పేరలల్ గా పెరగసాగింది.

ఒక్కోసారి మరీ ఆడపిల్లల్లా ఒంటికి అతుక్కుపోయేట్టు బట్టలు వేసుకొని రావటం, దుస్తులు, మేకప్ అవీ ఆడపిల్లల్లా వేసుకుని వచ్చేవారు. నాకు అది వల్గర్ గా అనిపించేది. నాకు అర్థం అయ్యేది కాదు అసలు తనని ఉద్యోగం లోకి ఎలా తీసుకున్నారా అని. ఇంటర్యూ కి కూడా ఇలాగే డ్రెస్ అయి వచ్చారా? ఎందుకో, నాకు అనవసరమైన ఇంటువంటి విష్యాలు నన్ను డిస్టర్బ్ చేయటం మొదలెట్టాయి.

తను చేరి 15 రోజులు దగ్గరకి అయింది. ఒకసారి ఎదో మీటింగ్ లో వున్నాం. ఇంకా అందరూ బోర్డ్ రూము లోకి రాలేదు. నేను, తనూ, మరొక కొలీగ్ వున్నం. ఎవో పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. నేను తనమీద ఎదో జోక్ వేస్తూ "అతను " అని xyz ని గురించి వాడాను. దానికి మా వేరే కొలీగ్ అన్నారు.

"తైవనీస్ భాషలో స్త్రీలింగంకి, పుల్లింగానికీ వేరే మాటలు లేవు. నా భార్య తైవనీస్ అమ్మాయి. కనుక తనకి అదే అలవాటు ప్రకారము ఇంగ్లీషులోని he, she పదాలని కంఫ్యూస్ అయి వాడుతుంది. మీ భాషలోనూ అంతేనా?"

నాకప్పుడు తట్టింది అయ్యింది ఒకవేళ xyz గానీ అమ్మాయి అయివుంటుంది. నేనిన్నాళ్ళూ ఛ! అప్పటికి ఎదో గొణిగేసి దాటించేసాను. తర్వాత తీరిగ్గా ఒకసారి కూర్చుని గత కొద్ది రోజులుగా నేనన్న మాటలు, దానికి తన ప్రతిస్పందనలూ, అన్నీ పునస్చరణ చేసుకుని తను అమ్మాయి అని నిర్థారణకి వచ్చాను.

తరువాత ఎప్పటికో తనకి మంచి ఫ్రెండ్ ని అయ్యాను. కానీ అమ్మాయి అనుకున్నాక, తనలో కొన్ని అబ్బాయిల లక్షణాలు కనిపించటం మొదలయ్యాయి. ఒకటి రెండుసార్లు తను తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తుంటే, మళ్ళీ తను ఒకవేళ గానీ లెస్బియన్ ఎమో అని అనుమానం. అయినా అది తన పెర్సనల్ విష్యం. ఒకసారి ఆల్రెడీ తప్పు చేసాను. ఇంక మళ్ళీ చేయకూడదు అనుకున్నాను.

మామూలు ఆడపిల్లలు ఒకరితో ఒకరు చెప్పుకునే ఆడపిల్లల్ల కబుర్లు అన్నీ చెప్పేదాన్ని. అబ్బాయిలతో చెప్పలేని మామూలు రోజువారీ కామెంట్లు, అప్పుడప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీ. కానీ ఒకోసారి ఎప్పుడైనా అనుకునేదాన్ని, వచ్చిన కొత్తల్లో నా ప్రవర్తనకి తనని క్షమాపణలు అడుగుదాం అని. కానీ తను అది మనసులో పెట్టుకున్నట్టు అనిపించేది కాదు. సర్లే అని నిర్లక్ష్యం.

ఒకరోజు xyz గర్ల్ ఫ్రెండ్ నుంచి నాకు మైల్ వచ్చింది. త్వరలో రాబోయే xyz పుట్టినరోజుకి ఒక surprise పార్టీ ఇద్దామనుకుంటున్నాననీ. నా గురించి తను చెప్పగా విన్నాననీ, కనుక ఆ పార్టీ లో జాయిన్ అవటం నాకిష్టమేనా అని! తను నాకా మైల్ నా వెబ్సైట్ నుంచి ఇచ్చారు. మా మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో xyz కి వున్న వెబ్సైట్ ఎడ్రస్ ఇచ్చింది. అందులో తను ఏం రాసిందో చూద్దామని ఆశక్తితో ఆ సైట్ కి వెళ్ళాను. అందులో ఒకదగ్గర xyz రాసారు తను ఒక proud trans woman అని.

నాకు ఆ మాటకి అర్థం తెలీదు. చూడగా అందులో ఆ మాటకి అర్థం వివరించి చెప్తూ.. తనని తన sexuality వలన కొలీగ్స్, ఫ్రెండ్స్ ఏ విధంగా వివక్షణతో చూసారో, వారిని కరెక్ట్ చేయటానికి తన మనసు ఎందుకు ఒప్పుకోలేదో, ఇక్కడి ప్రజలకి Trans-sexuals కూడా మనుషులే అని ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఎంతగానో వుందనీ, ఈ రకమైన వివక్షణ వలన ఎంతో మంది డిప్రెషన్ కి గురి అవుతున్నారనీ, అదంతా చదువుతుంటే.. నేను తనని అబ్బాయిగా అనుకుని మాట్లాడిన మాటలన్నీ ఎక్కడ తను వివక్షణ గా తీసుకుందో అన్న అనుమానం, నా అజ్ఙానానికి సిగ్గు, తను ఆడపిల్ల అని అనుకున్నాక తనకి నేను నా గురించి చెప్పిన విష్యాలు తలచుకొని అవమానం, ఇప్పుడు తనని అమ్మాయిగా అనుకోవాలో, లేక అబ్బాయనుకోవాలో తెలియని సందిగ్థం, తను కోరుకున్నట్టుగా అమ్మాయి అని అనుకోగలనా అని అనుమానం!

నేను ఇంత ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ భారతదేశంలో వీరిపట్ల సమాజ ప్రవర్తన మన అందరికీ తెలిసినదే. నేనూ ఆ సమాజంలోంచి వచ్చినదాన్నే. ఇంకా ఆ శంకలు పోని దాన్ని. కానీ ఇక్కడ ఇబ్బంది అల్లా, ఇక్కడ కూడా లీగల్ గా వారికి ఎన్ని హక్కులూ కల్పించినా సగటు మనిషి వారి పట్ల అజ్ఙానం వలననో, లేక మరే కారణం వలననో వారిని తెలిసో తెలియకో తమ మాటలతో బాధ పెడతూనే వున్నారు.

మన భారతీయులయితే, ఇక్కడ పరిస్థితులు అర్థం అయ్యాక వారి మనస్థత్వం ఎలా మారుతుందంటే, అబ్బాయిలతో ఏమైనా చేయి, ఫర్లేదు. ఎందుకంటే, ఇక్కడ అబ్బాయి, అమ్మాయి పబ్లిక్ గా ఏం చేసినా పట్టించుకోరు. కానీ అమ్మాయిలతో మాత్రం పబ్లిక్ గా వున్నపుడు మాట్లాడేటప్పుడు కనీసం మీద చేయి వేయటానికి భయపడతారు. కొన్ని రంగులు (ముదురు పర్పుల్) వైపు కన్నెత్తి చూడరు. చిన్నప్పటి నుంచీ వున్న ఆలోచనలు మారటానికి కొంత సమయం పడుతుంది. కానీ నాలా ఎవరూ అటువంటి వారిని తెలిసి గానీ తెలియక గానీ అవమానించకూడదు.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.