|
దొంగలు పడిన ఆర్నెల్లకి పోలీసులు వచ్చినట్టూ ఇది రాసిన ఆర్నెల్లకి పబ్లిష్ చేస్తున్నాను.. రామదాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రి అంటుందేమిటా అని ఖంగారు పడకండి. ఇది ఎప్పుడో రాసాను మరి ఎలా మిస్ అయిందో!?
* * *
మన ఆరోగ్య శాఖ మంత్రి రాందాస్ గారు ఒకోసారి నాకు తుగ్లక్ వంశస్థులేమో అని అనుమనం వచ్చేలా ప్రకటనలు చేస్తూ వుంటారు. ఆయన ప్రస్తుతం సినిమా వాళ్ళ మీద తన తుపాకులు ఎక్కుపెట్టారు. మొదట షారూఖ్ మీద తర్వాత సైఫ్ ఆలీ ఖన్ మీద ఆ పైన మొత్తం సినిమా వాళ్ళ మీద!
ఇన్ని ప్రకటన్లు చేసే ఆయన ఎందుకు పొగాకు అమ్మకాల మీద నియంత్రణ ని కఠినంగా అమలు పర్చరో అర్థం కాదు.
నా ఈ రాతలు ఆయన ఆ మధ్య చేసిన సినిమా వాళ్ళ పొగతాగే సీన్ లు, ఫొటోల వలన దేశం లోని యువత పొగ త్రాగటానికి అలవాటుపడటానికి కారణం అనే ప్రకటన.
దానికి షారూఖ్ తనదైన తెలివి సమాధానం చెప్పి నవ్వేసారు. అమితాబ్ బచ్చన్ తనకి కొత్తగా దొరికిన ఆట వస్తువు బ్లాగ్ లో రాసేసారు మిగిలిన సినిమా వాళ్ళు వాళ్ళకి వీలైన రీతి లో సమాధానలు లేక అభిప్రాయాలు చెప్తున్నారు.
ఈ మొత్తం హంగామా కి జవాబు గా ఎదో సైట్ లో ఒకాయన రాసిన వ్యాసం ఒకటి చదివాను. ఆయన వాదన. మన సినిమాల్లో 80% కధాంశాలు చెడు మీద మంచి గెలవటం, హీరో అన్నీ మంచి పనులు చేయటం వగైరా. వాటిని చూసి మరి మన యువత అన్నీ మంచి అలవాట్లు చేసుకుంటున్నారా.. చెడు చూసి చెడు అలవాట్లు చేసుకోవటానికి అని! మన తెలుగు సినిమాలు తీసుకుంటే మంచి హీరో కూడ ఒక్క చేత్తో వంద మంది విలన్లని ఉతికేసి ఆరేస్తూ వుంటారు. అది చూసి మన యువత అవి నేర్చుకున్నారా అని అడిగితే.. శివ సినిమా తరువాత ఎంతమంది సైకిల్ చైన్ తీసి జనాలని ఉతకటం ఫేషన్ అని భావించలేదు?
ఎవరి వరకో ఎందుకు? ఘర్షణ సినిమా విడుదల అయినప్పుడు మాట. ఫ్రెండ్స్ తో కలిసి అమల పాత్ర సిగరెట్ తాగటం ప్రాక్టీస్ చేసే దృశ్యం చూసి మేము ఫ్రెండ్స్ అంతా సిగరెట్లు కాల్చాము. అది ఇప్పుడు సరదాగా నవ్వుతూ మా పెద్దాళ్ళకీ, ఈ కాలం పిల్లలకీ చెప్తాం కానీ ఆ రోజుల్లో అమ్మాయిలు సిగరెట్లు తాగటం అంతే మరి పెద్ద ఎడ్వంచరే. సినిమాలో ఆ సీన్ చూసి వుండకపోతే మాకు అలాంటి ఐడియా అసలు వచ్చి ఉండేదే కాదు. అమ్మాయిలు సినిమాల్లో గ్లామరస్ గా కనిపించే అమ్మాయిలని రోల్ మోడల్ గా తీసుకున్నట్టు అబ్బాయిలు తమ దృష్టి లో స్టయిల్ గా వుండే హీరో లని చూసి వాళ్ళు తెరపై చేసే ఎడ్వంచర్లు వీళ్ళు కూడా నిజజీవితం లో చేయటానికి ప్రయత్నించటం తప్పకుండా జరుగుతుంది.
ఇప్పుడు కొత్తగా రాందాస్ గారు కొత్త బాంబ్ పేల్చారు. ఆఫిసుల్లో పొగ త్రాగటం నిషేధిస్తున్నాం అని. ఒకవేళ ఎవరైనా చుట్టలు ముట్టిస్తూ పట్టు పడితే వాళ్ళనే కాక వారికి నౌఖరీ ఇచ్చిన వాళ్ళని కూడా ఫైన్ లు కట్టేలా చేస్తారుట. ఇప్పుడు మన ప్రభుత్వ ఉద్యొగులు ఎవరైనా అలా పట్టు పడితే మన ప్రభుత్వాలే వారి తప్పిదానికి ఫైన్ లు చెల్లిస్తారా? tax-payers డబ్బే కదా.. చెల్లిస్తారేమో!
|