సినిమా పరం గా కన్నా, హేరో పరం గా విడుదలకు ముందు నుండి ఆసక్తి కలిగించిన ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా అదే ధోరణి ని కొనసాగించింది
బళ్ళో వేసే మొదటి రోజు పలకలిచ్చి, బలపాలిచ్చి, పులి అయిపోవాలి లైF లో అని మనోడ్ని ఎలా వదుల్తామో బడి లోకి, అలానే వదిలారు ఈ చిరుత ని అన్ని హంగులు ఇచ్చి బరి లోకి.కొంతమంది కి స్కూల్ శ్రీరామ రక్ష అయితే, కొందరు స్కూల్ కి శ్రీరామ రక్ష అయి పేరు తెస్తారు.
పాత సిలబస్ తో పాటం చెపుదామని ట్రై చేసిన పూరి స్కూల్ కి చరన్ వరం అయ్యాడు. అంత కు మించి చెప్పుకోడాని కి ఏమి లేదు ఇందు లో.
వారసుడు నెత్తి మీద కిరీటం తోనే కాదు, తలకు మించి న భారం కూడా మోస్తుంటాడు తెలియకుండానే. అదనం గా, ఇంకో బరువు కూడా పెట్టారు పరిచయ కర్తలు, కాకపోతె నెత్తి మీద కాదు, భుజాల మీద . "మా దేమీ లేదు, మా దగ్గర కథేమి లేదు, కథ లేదు కాబట్టి, చెప్పగలింది సొదే, కనుక , కర్త, కర్మ, క్రియ అంతా నువ్వే, మేం నిమిత్త మాత్రులం" అని చేతులెత్తేసారు.
కుర్ర బాట్స్ మన్, పైగా కొత్త బాట్స్ మన్, మొదటి బంతి కే బౌన్సర్ పడ్డట్టు అయ్యింది, కాని వీరోచితం గా పొరాడాడు పులిబిడ్డ . చిరుత కూడా బోర్లా పడుతుంది పరుగు లో "ప్లాట్ Fఒర్మ్" సరిగ్గా లేకపోతే. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. కథ, కథనాలు "మినియాపోలిస్ బ్రిడ్జ్" లా కూలిపోవడం తో చిరుత ఇరుక్కుపోయింది వేలాడుతూ మధ్య లో.
30 ఏళ్ళ ఎక్స్ పీరియన్సు లు, 60 సినిమాల అనుభవ అగ్ర హీరో లు, 6 కోట్లు తీసికునే కుర్ర హీరో లు, 3 సూపర్ హిట్లు ఇచ్చిన బుల్లి హీరో ల నటన చూడటం అలవాటు అయిపోయిన అధికశాతం ఆంధ్రా ప్రేక్షకుల కి , చరన్ లో కూడా "అదే స్టాండర్డ్" టాలెంట్ పుష్కలం గా కనిపిస్తుంది. వున్న గుంపు కి ఏ మాత్రం తగ్గడు ఫ్యూచర్ లో అనిపించడం ఖాయం.
ముఖ్యం గా తండ్రి కి తగ్గ తనయుడు అయ్యాడు డాన్సు, ఫైట్ విభాగాల్లో. మొదటి పాట ఫాన్సు కి కిర్రెక్కిస్తుంది, మొదటి ఫైట్ అదరహో అనిపిస్తుంది. తన ఇంట్రడక్షన్ సన్నివేశం లో కొద్ది కొద్ది గా ముడి విప్పుతూ వారసుడ్ని ఆవిష్కరించిన సన్ని వేశాని కి చప్పట్ట్లు పడతాయ్, మితిమీరిన ఫైట్లు వుంచినందుకు ఆ పిదప తిట్లు పడతాయ్. ఇంటర్వల్ తర్వాత వచ్చే మొదటి పాట లోను మనకి మర్చిపోయిన మెగా స్టార్ స్టెప్పులు గుర్తుకు తెస్తాడు.
ప్రకాష్ రాజ్, తల్లి ని తిరిగి చరన్ కి అప్పగించిన సన్నివేశం లో బరువైన సన్నివేశాన్ని మోయగలిగాడు.
పార్టి లో తాగి భుజం మీద వాలిపోయిన హీరో ఇన్ ని "నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది రా" అని MS ప్రశ్నించినప్పుడు "అందాని కి, అంతరాని" కి తేడా చెపుతూ ఆ అమ్మాయిని అసహ్యించుకుంటూ చెప్పే సన్నివేశం లో పాస్ అయిపోయాడు.
దీవి లో, అమ్మాయితో, మనిషి ని గౌరవించడం, ప్రేమించడం నేర్చుకో అనే హితబోధ చేసే సీన్ లని హిట్ చేసాడు.
చివరి ఘట్టాల్లో "ఖైదీ" గెటప్ తో అరగంట కు పైగా విలన్ తో పాటు ప్రేక్షకులని వేటాడిన సన్నివేశాలో, తనవి వొట్టి కండలు కాదని గట్టి కండలే అని నిరూపించాడు, బాగ కష్ట పడ్డాడు "బాబు" ఇక్కడ.
మొత్తం మీద "చిరు"త లక్ష్యం నెరవేరింది.
ఈ పులి పిల్ల, "పిల్లి" పిల్ల కాదని నిరూపించింది మొదటి సినిమా తో. మంచి కథ నో, కథనాన్నో నమ్ముకుని, కూసింత శ్రద్ద పెడితే ఆహార్యం, వాచికం మీద, మెగా వారసుడు విజౄభించడం ఖాయం. ( అవే వస్తాయ్ అనుకోండి కాలక్రమేణా! , ఎంతమంది "విక్రమార్కుల" ని చూడటం లా తర తరాలనుండి)
మొత్తం మీద ఎంట్రన్సు టెస్ట్ లో రాంక్ వచ్చింది, డిగ్రీ, పి.హెచ్.డి లు ఇహ ఆయన "స్వయంకౄషి" మీద.
ఇహ హంగులు,ఆర్భాటాలు గురించి చెప్పేసుకున్నాం కదా, ముగించేముందు మింగుడు పడని ఆ కథ, కథనాలు గురించి కూడ ఒక ముక్క చెప్పేసుకుందాం.
"నవరసాలు నింపేద్దాం ఒకే దాన్లో అన్న తొందరలో, వొంపేసారు పూర్తిగా అన్నీ నేల మీద". కథ కన్న కథనం మీద, హీరో "గీర" మీద, కామెడి "కూర" మీద సినిమా వండే మన పూరి, ఈ సారి పిండి కలపడం లో, ఏదో తేడా జరిగి పూరి పొంగ క పోగా, వొంగిపోయింది.
ప్రేక్షకుడి కి తెర వెనుక కారణాలు పట్టవ్ కనుక, సినిమా పొడుగూత ఆపకుండా పూరి పేరు ని నొట్లో చపాతి నమలినట్టు నమిలేస్తారు నాసిరకం వంటకాని కి. ఎంత పౌరాణికం సినిమా అయిన, ప్రతి పదం తర్వాత ఒక పద్యం వస్తే ఈ కాలం ప్రేక్షకులు ఎల సహించరో, అలానే ఎంత చిరంజీవి సినిమా అయిన, అతని కొడుకు సినిమా అయినా, మెయిన్ సైట్ కి వెళ్ళే ముందు అడ్డం పడే pop up ad లా ఆకర్షించని పాటలు అడ్డం పడితే చిరాకెత్తి పోతారు. ఒక దశ లో మణిశర్మ మీద మన కి పుట్టెడు కోపం వేస్తుంది "నేను 5 సాంగ్స్ కన్నా ఇవ్వలేనండి" అని ఖరాఖండి గా చెప్పనందుకు. కథ ని ఓ 7 రీళ్ళ లో, పాటలు, ఫైట్స్ ని కలిపి ఇంకో 7 రీళ్ళ లో తీసి ఇస్తే ఏ ఎడిటర్ మాత్రం ఎంతకని సర్దుతాడు? కనుక ఇక్కడా ఎడిటర్ అదే పని చేసాడు. ఒక సీన్, ఒక పాట, ఒక ఫైట్ చొప్పున కుట్టేసాడు.
పూరి ఎక్కడ విజయం సాధించాడు అంటే " చరన్ ని ఫ్యూచర్ లో సక్సస్ ఫుల్ హేరో కింద చూడగలం" అన్న ఫీల్ తెప్పించడం లోనే. ఇహ అన్ని విధాల అతను విఫలం చెందాడు.
మిగిలిన అందర్ని గురించి చెప్పుకునే చిత్రం ఏ మాత్రం కాదిది.
ఇహ చివరిగా ,చిత్రం చూడాలా, వద్దా అంటే,
పులి నోట్లో తల పెడతారా అంటే, మీ ఇష్టం. లేదు, ఇంత కన్నా క్రూరమౄగాలనే చూసాం అంటారా, ఈ చిరుప్రాయం చిరుత చిందులు కోసం అయినా తప్పక చూడొచ్చు.
|