|
ప్రముఖ సినీ దర్శకులు రాం'గోపాల్ వర్మ సినిమాలు నాకు నచ్చుతాయి. దానికి కారణాలు
చాలా వున్నాయి. కానీ ఆయన తెలుగు సినిమాలు తలచుకున్నప్పుడల్లా.. చాలా కోపం వస్తుంది.
Hindi సినిమాలు తీసేటప్పుడు వున్న ఆ ఇంట్రెస్ట్, ఆ డెడికేషన్ కనిపించవు. దానికి
కారణం తెలుగులో ఏం తీసినా చెల్లుతుందిలే అన్న నిర్లక్ష్యమా లేక గోవిందా గోవిందా
సినిమా హంగోవరా? కానీ ఆ సినిమా ముందు కూడా.. ఆయన తెలుగు సినిమాలు చూస్తే.. ఒక
నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది.
తన ప్రయోగాలన్నీ ఉపయోగించిన సినిమాలు శివ, గాయం. అందులో కొంచెం hit అయిన పాయింట్లు
యింక తరువాతి ప్రతీ సినిమాలో ఉపయోగించారు. ఇటువంటి ధోరణి వలన దర్శకుని క్రియేటివిటీ
మీద సందేహం తలెత్తుతుంది. తన ఎన్ని సినిమాల్లో ఆయన ఆ సినిమా hall సీన్ ని వాడారో
లెఖ్ఖ వేయండి! అంతకన్నా ఎన్ని సినిమాల్లో వాడలేదు అన్న count ఈజీ నెమో! ప్రధాన జంట
పారిపోవటం, తెలంగాణా భాషతో కామెడీ.. చెప్పుకుంటూ పోతే ఎన్నో!
చూసినదే మళ్ళీ మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు తేరగా డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తారు?
అందుకే ఆ సినిమాలు పరాజయం పొందాయి. ఎంత style వున్నా.. ఎంత మంచి నటనలు వున్నా..
దర్శకుని నిర్లిప్తత చిత్రం అంతా కనిపిస్తుంటే.. ఎవరికి మాత్రం ఆ సినిమా చూడాలని
అనిపిస్తుంది? ఆయన దర్శకత్వం లో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకుడిని
పరీక్షిస్తాయి.. ఆయన సినిమా అన్న అభిమానంతో వచ్చినందుకు శిక్షిస్తాయి.
ఉదాహరణకి అంతం సినిమా. అందులో నాగార్జున ఎంత మందిని మర్డర్ చేస్తారో ఒకరోజు మా
చెల్లెలు సుజాత లెక్కేయటం మొదలెట్టింది. ఎంతో సంఖ్య గుర్తు లేదు.. 50 పైనే
చెప్పింది. అదే విధంగా ప్రేమకధ చిత్రంలో ఒక్క రాధిక తప్ప ఇంకే కారెక్టర్ నీ
ఒదల్లేదు. come on.. sir.. ఆ సినిమా అసలు ప్రేక్షకులు చూడటం కోసమే తీసారా?
రాం'గోపాల్ వర్మ, మరొక తెలుగు చిత్ర రంగ క్రెయేటీవ్ జీనియస్ వంశీ కలిసి w/o
వరప్రసాద్ చిత్రం ప్రకటించినప్పుడు ఆ చిత్రం ఒక స్థాయిలో ఊహించుకున్నాను. కానీ ఆ
చిత్రం ఒక భయంకరమైన శిక్ష! ఎదో అక్కడక్కడ తళుక్కుమని తారల్లా మెరిసే మంచి సీన్ కోసం
రెండున్నర గంటల శిక్ష భరించే ఓపిక ఎవరికుందీ? అందుకే ఆ చిత్రం అలా ఫట్ మంది.
ఇంక horror సినిమాలంటూ తీసిన రాత్రి, దెయ్యం సినిమాలు...
మనీ.. మనీ సినిమాలో బ్రహ్మానందం అనుచరుడు ఒకడు.. బ్రహ్మానందం చక్రవర్తి కేరెక్టర్
ని చంపడం గురించి తన ప్లాన్ చెప్తున్నపుడు అంటారు..
"మీరు చెప్పినదందా రాం'గోపాల్ వర్మ రాత్రి సినిమా అంత confusing గా వుంది అన్నా"
అని.
రాత్రి confusing సినిమా కాదు ఒక lousy సినిమా . ఒక సరైన కధ గానీ కన్విన్సింగ్ కధనం
కానీ లేకపోతే.. అలాగే వుంటుంది మరి. దెయ్యం (లేక రాత్రి?) చిత్రంలో ప్రముఖ hindi
నటులు ఓంపురి ఒక 5 నిమిషాల పాత్ర వేసారు. ఆయన కూడా ఎక్కడో ఆ చిత్రాన్ని విమర్శించడం
చదివినట్టు గుర్తు. ఇంక ఆయన చిత్రాల్లో మరొక ముఖ్య లోపం పాటల టైమింగ్. ఎంతో
గ్రిప్పింగ్ గా కధ నడుస్తున్నపుడు సడన్ గా పాటలు ప్రత్యక్షమవుతాయి.
దురదృష్ట వశాత్తూ ఆయన శిష్య గణం కుడా ఆయన మాదిరి గానే చిత్రాలు తీస్తున్నారు.
వున్నంతలో శ్రీ. శివనాగేశ్వర రావు, శ్రీ కృష్ణ వంశీ తమకంటూ ఒక ప్రత్యేక పంధాని
ఏర్పరుచుకున్నారు. వాళ్ళిద్దరూ రాము ప్రమేయం లేని సినిమాలు కూడా తీసి కొంతవరకూ
విజయం సాధించారు. ఆయన కున్న ప్రతిభ వుందో లేదో తెలియదు కానీ దురుసుతనం వున్న మరొక
శిష్యుడు తేజ (తేజ ఇంటర్వ్యూలు చదవండి). నేనింకా ఆయన చిత్రాలు ఏవీ చూడలేదు.
రాం' గోపాల్ వర్మ ఎన్ని ఇటువంటి చిత్రాలు తీసినా.. ప్రతీ దానిలోనూ ఆయన style ఒకటి
కనిపిస్తుంది. ఊర్మిళ లోని అందం, నటన మనకి ఈయన సినిమాల్లోనే కనిపిస్తుంది. చక్కటి
సంభాషణలు, screen play, మెలోడ్రామా లేని పాత్రలూ, సంఘటనలూ., నిత్యజీవితంలో కనిపించే
హాస్యం, చిన్న చిన్న పాత్రలకి కుడా మంచి సమర్థ నటీ నటుల ఎంపిక. చెప్పుకుంటూ పోతే
ఎన్నో!
క్షణ క్షణం చిత్రం లో పరేష్ రావల్ పాత్ర ఎవరు మర్చిపోగలరు?! బ్రహ్మానందం, ఊర్మిళ,
చక్రవర్తి, నాగార్జున, జగపతి బాబు, జయసుధ వీరందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు
నిచ్చినది ఈయన సినిమాలే. వీరిలో కొందరు ఈయన సినిమాల్లో నటించే ముందే ప్రముఖులు..
కానీ రాం'గోపాల్ వర్మ సినిమాల్లో ఆ నటీనటుల నటన లోని ఒక క్రొత్త కోణం చూస్తాం.
జగపతి బాబు కంఠం లోని కరుకుతనం, నాగార్జున కళ్ళల్లోని తీక్షణత, ఊర్మిళ నటన, జయసుధ
లోని ప్రౌఢ హుందాతనం, చక్రవర్తి నటనలోని ఈజ్ మొదలైన వాటిని మనకి పరియయం చేసినది
రాం'గోపాల్ వర్మ సినిమాలే.
ఆయన చిత్రాలు తీసే style నచ్చిన నాలాంటి అభిమానులు ఆయన తీసిన ఎటువంటి నిస్సారవంతమైన
చిత్రాన్నైనా చూస్తారు. కానీ అది సరిపోతుందా.. ఒక మంచి దర్శకుడిగా పేరు
తెచ్చుకోవాలంటే అందరికీ నచ్చే సినిమాలు తీయాలి కదా? ఆయన తన ప్రతిభని తీసే ప్రతీ
సినిమా లోనూ పూర్తిగా వినియోగించకపోవటం నిజంగా చాలా దురదృష్టకరం.
|