నీవెపుడొస్తావని
రేయీపగలు ఎదురుచూస్తున్నా
ఈ కాలం కదలటంలేదు
నీ ఒడిలో తలపెట్టి
హాయిగా సేదతీరాలని వున్నా
ఈ దూరం నీదరి చేరనివ్వటంలేదు
నీతో మాట్లాడాలని
ఎదలో ఊసులన్నీ నీకు చెప్పాలని వున్నా
మాటలు రావటంలేదు
ఈ గొంతు మూగబోయింది
నీ తో గడిపిన
ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉంది
మరచిపోతానని భయంతొనేమో
ఈ నిద్దుర నా కంటిని చేరటంలేదు
|