ఏ TV చానెల్ చూసినా,
ఏ న్యూస్ పేపర్ చూసినా
ఒకటే న్యూస్....
మన మనసులు కలిచివేసే న్యూస్..
"చెత్త కుండీ లో ఆడశిశువు"
"బతికిబయటపడ్డ భూమి పుత్రిక" (బతికి వుండగానే పూడ్చి పెట్టిన ఆడ శిశువు గురించి వచ్చిన వార్థా కధన ఇది)
"ఆడపిల్లని ఆసుపత్రి లోనే వదిలి వెళ్ళిన అమ్మ"
ఇలా ఎన్నో..
ఇటీవల పెరిగిపోతున్న ఆడ శిశుమరణాలు..
ఆ శిశువుల మృత్యూఘోష ఇది..
- వాసిసి సురేష్
కళ్ళు కూడా తెరవక ముందే
లోకాన్ని కూడా చూడక ముందే..
ఆసుపత్రి నుండి ఇంటికి
రాకముందే..
అమ్మా అని నిన్ను
పిలువకముందే..
నీవు పంచిన పేగు బంధం కూడా
తెగకముందే..
నాకు పేరు కూడా
పెట్టకముందే..
విసిరివేస్తున్నారు
నన్ను
పొత్తిళ్ళ నుంచి చెత్తకుండీల్లోకి..
సాగనంపుతున్నారు
నన్ను
పురిటిల్లు నుంచి వల్లకాడు లోకి..
ఆడపుట్టుక
నే చేసిన పాపమా..
ఆడపుట్టుక
నే చేసిన నేరమా..
ఎందుకు నాకీ మరణశిక్ష..
ఎందాక నాకే మరణశిక్ష..
|