శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము : పారాయణ చేయు విధానము - పి.నారాయణరావు Back   Home 

ఈ గ్రంధమును గురువారము నాడు పారాయణ చేయుటకు ప్రారంభించ వలయును. తూర్పు వైపు ముఖము పెట్టుకొని కూర్చుండ వలయును. ముందర నాలుగు కాళ్ళు గల పీటకు (ఎత్తైన బల్ల) వేసి దానిపై బాబా ఫోటోను శ్రీ సాయి సచ్చరిత్రను బెట్టి పూజ చేయవలెను. పిమ్మట పారాయణ ప్రారంభించ వలెను. విషయసూచికలో చూపిన ప్రకారముగా ఆయా రోజులలో ఆయా యధ్యాయములు పారాయణ చేయవలెను. పారాయణము బుధవారము ముగియును. మరుసటి గురువారం 51 అధ్యాయము పారాయణ చేసి ముగించవలెను.

ముగించు గురువారమునాడు శ్రీ సాయి పూజ చేసి మిఠాయిని పంచి పెట్టవలెను. శక్త్యానుసారము బ్రాహ్మణులకు, బంధువులకు భోజనము పెట్టి, తాంబూలము దక్షిణతో సమర్పించవలయును.

ఆనాడు రాత్రి వేదగోష్టి చేయించవలెను. చక్కెర కలిపిన వేడి పాలను వేదగోష్టి చేసిన బ్రాహ్మణులకు దక్షిణతో సమర్పించవలెను.

ఆ సమయమున బాబాకు రెండు రూపాయలు దక్షిణ నొసగ వలయును. అవి శ్రీ షిరిడీ సాయిసంస్థనమునకు తప్పక చేరునట్లు చేయవలయును. ఎందుకనగా, దక్షిణలేని పూజ ఫలించదు. దీనికి ఈ క్రింద చెప్పబడిన శ్లోకమే వేదప్రమాణము.

"న నిష్కేణ వినా పూజ ఫలభోగాయకల్పతే
ఫలమూలం తు నిష్కమశ్యాత్,
అనిష్కం నిష్ఫలం తు తత్ "

విషయ సూచిక
DayWeek DayChapters to Read
1ThursdayIntroduction, 1-7 Chapters
2Friday8-15 Chapters
3Saturday16-22 Chapters
4Sunday23-30 Chapters
5Monday31-37 Chapters
6Tuesday38-44 Chapters
7Wednesday45-51 Chapters