కన్ "ఫ్యూజన్" కవిత లు.. - పార్థు Back   Home 
ఈ పేజీ ని పంపండి
ఇదీ మా బావ గాడి పనే.
వాడు కన్ ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని కన్ ఫ్యూజ్ చేసే వాడు కవితల్లో.
ముందు లైన్ లో ఒకటి చెప్పే వాడు, పక్క లైన్ లో కొచ్చేసరికి పద్దతి మార్చేవాడు.
పది రకాల ప్రేలాపనలు చేసే వాడు పొంతన లేకుండా..
ప్రేమలు, దోమలు, పగలు, ప్రతీకారాలు, దేశం లొ వున్న అరాచక పరిస్థుతులు, అవాంచనీయ సంఘటనలు
అన్నీ అందులోనే.....
"ఏంటిరా ఇది?" అంటే
"ఫ్యూజన్" అనే వాడు
"కన్ ఫ్యూజనేమో? కాస్త అలోచించకూడదు" అంటే,
"ఉత్కోర్ష, ఆత్మ పరిశీలన, స్వయం ప్రక్షాళన" అంటూ ఏవేవో పెద్ద పదాలు వాడే వాడు.

మీరూ కన్ ఫ్యూజ్ అవ్వండి.....

నేను ఎవర్ని? నాలో నేను చూసుకుంటే నేను కనపడలేదే?
నా కనులు మూసుకుపొయాయా? కనుబొమ్మలు కదిలించలేనంతా కూరుకుపొయాయా?
నా రూపం నా దగ్గర కాక ఇంకెక్కడకెడుతుంది? నన్ను వదిలిపొయిందా!
ఎప్పుడుపడితే అప్పుడు లేచిపొవడాని కి అదేమన్నా అట్టర్ ఫ్లాప్ సినిమా నా?
పోతే పొయింది, ఈ రూపురేఖ ఎలా మార్చింది?
అద్దం లో అడ్డం గా గడ్దం తో కనిపించే ప్రతిబింబం
అందం గా, మెరిసే గంధం లా , కురిసే చందం గా కనిపిస్తుందంటే
మాయ కాక ఇంకేంటి? అవును కచ్చితం గా ఇది మాయే? తన మాయే, అవును తన పేరు "మాయే",
మరి ప్రేమ అంటారెందుకు పక్కవాళ్ళు? వాళ్ళకేమన్నా గుడ్డా లేక ప్రేమ గుడ్డిదా?
మాయ నుండి పుట్టేదేనా ప్రేమా? లేక ప్రేమ అంతా మాయా?
ఏదైనా ఈ మాయ ప్రపంచం లో నిజమైన ప్రేమ నా సొంతం అన్న ఊహ నన్ను
ఉక్కిరిబిక్కిరి చేస్తొంది, 'మాయ ' నాది అన్న నిజం మనసు ని పచ్చడి పచ్చడి చేస్తొంది.

అయినా నా పిచ్చి గాని, రూపమే వెళ్ళిపొతే, ఇంక మనసెక్కడ వుంది?
లేదు , "వుంది.." ( వుందో, లేదో సరిగ్గ తేల్చుకుని చెప్పు "బే" అనేవాడు బాబాయ్)
"రూపాలు మావి వేరు కావొచ్చు, కాని మనసులు ఒక్కటే"
"సర్దుబాటా?" బాబాయ్ తిరిగి ప్రశ్న.
కాదు "దిద్దుబాటు".
ఇంకెందుకు ఆలశ్యం మిగిలింది మొదలెట్టు...

"అమ్మయ్య! మొత్తాని కి నా మనసు నా దగ్గరే వుంది " .
"మరి ఇక్కడ నా మనసు పచ్చడవుతుంటే అక్కడ తన మనసేమవుతూ వుందో?"
ఏమైతేనేం? నా వుచ్చ్వాశాలే తన ఊపిరిగా, నిచ్చ్వాశాలే మా ప్రేమ కు విశ్వాసం గా
ముందు కు సాగుతాం, మాయ ను వొప్పిస్తా, మా ప్రేమ ని నడిపిస్తా

మా అందరి కళ్ళలో ఆనందం వాడి పట్టుదల కి.....ఇంత లోనే తలలు వాచిపొయేలా,

"నేనెందుకు పనికట్టుకు నడిపించాలి? ఏం ప్రేమ కుంటిదా? తనంతట తను నడవలేదా? ప్రతి వాళ్ళు
తన కాళ్ళ మీద తను నిలబడాలి? అప్పుడే ప్రగతి కి వెలుగు, యువత కి మలుపు, నవ తరాని కి పిలుపు, దేశ జాగౄతి కి మేలుకొలుపు".

"దేశాన్ని ముందు కు నడిపించాలి అంటుంటారు, పిచ్చి గాని అది సాధ్యమా?
భగ భగ మండే ఎండ ను అడుగు, సల సల కాలే నీళ్ళని అడుగు
నక నక లాడే నోరు ను అడుగు, మల మల మాడే కడుపు ను అడుగు
చెపుతుంది దేశం ఎలాంటి కష్ట పరిస్థుతలలో వుందో?
ఎవరైనా కలిసికట్టుగ చేయీ, చేయీ పట్టుకు నడిచినప్పుడే, ఏదైన బావుంటుండి దేశమైనా, దేహమైనా?".

దేహమంటే గుర్తొచ్చింది, ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపొయా "ఇంతకీ, నా రూపం ఎక్కడికెళ్ళింది?"
................."ఏట్లోకెళ్ళింది"
అరిచిందెవరో కనిపెట్టడాని కి వాడి కి అరక్షణం పట్టింది అంతే.
కట్ చేస్తే,
కాసేపటికి టే కొట్లో..........వాడి "రూపం, ఆకారం" కారం తో చేసిన మిరపకాయ బజ్జీలు తింటూ కనిపించింది.
అలా పంటి నోటి తో వాటిని, ఒంటి చేత్తో మమ్మల్ని నమిలేసే వాడు.

* * *

"మీ కవిత లో చాలా ఇన్ ఫర్మేషన్ వుంది అంకుల్" అని వెంకటేష్ చెప్పే సీన్ చూస్తే ఇదే గుర్తొస్తుంది.
పార్ధూ

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత పార్థు కి తెలియచేయండి.