అంటే, విషయం అంత గా లేనప్పుడు, టైం ఎక్కువ దొరకనప్పుడు పుట్టుకొచ్చే పిచ్చి రాతలు.
మొన్నో మిత్రుడు "ఏరా కబుర్లు ఎక్కువ వినిపిస్తున్నావ్ ఈ మధ్య, కవితలు వొదిలేశావా?" అన్నాడు
వాడి తిక్కా, రోగం రెండూ కుదర్చడాని కే ఇది మొదలెట్టా.
వీటిల్ని కవితలే అంటారో, వచనలే అంటారో, మరేదైనా అనుకుంటారో మీ ఇష్టం.
మా ఆవిడ మాత్రం "ప్రశ్నోత్తరాల" కార్యక్రమం లా వుంది అంది.
గమనిక:
మీరు ఏదో ఒక అగ్ర హీరో కి కరడు కట్టిన ఉగ్రాభిమానులైతే దయచేసి ఇది చదవకండి. చదివితే మాత్రం తిట్టుకోకండి.
- పార్థు
చిరంజీవి!
స్వయంకౄషి తో ఎదిగిన ఒ బడుగుజీవీ!
స్వామీ! అదే పేరు తో సినిమా తీస్తే, సున్నా చుట్టిందేమి?
బాలయ్యా!
"వంశం, వంశం" అంటావేంటి మాటమాట కి ముందు చెప్పయ్యా?
మరి వంశానికొక్కడు అలా బోర్లాపడిందేమిటయ్యా?
వెంకటేసూ!,
చేసా, చేస్తా అంటావ్ వెరైటీసు,
తీరా చూస్తే అన్నీ మూస రోల్సూ,
అయ్యిందేమయ్యా! పెద్ద తుస్సు సుభాస్ చంద్ర "బోస్" ?
నాగార్జున!
అంటావు "మ.. మ.. మ.. మాసు"
అందుకోలేదు ఇప్పటి దాకా వాళ్ళ పల్సు,
వింటున్నావా, హలో బాస్సూ?
|